Breaking News

సంక్షేమానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన

Published on Mon, 12/08/2025 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఏ వర్గాన్నీ విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని, ఎన్ని కల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌ పాలన నిలుస్తోందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. రెండేళ్ల కాలం తక్కువే అయినా ప్రభుత్వం సాధించిన విజయాలు అత్యద్భుతం.

ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్థపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి, ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని మాకు అప్పగి స్తే రెండేళ్లలోనే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దాం. ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నాం. తెలంగాణ రైజింగ్‌ – 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది’అని అన్నారు.

2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మో డల్‌గా నిలబెట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రా ష్ట్రంలో భూ సమస్యలను వీలైనంతవరకు తగ్గించడం, అర్హు లందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)