Breaking News

రుణమాఫీ పేరుతో ఫేక్‌ లింకులు.. మెసేజ్‌లు

Published on Fri, 07/19/2024 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్‌ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్‌ అకౌంట్‌ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్‌) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.

బ్యాంకుల పేరిట వాట్సాప్‌లలో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దని, వాటిని డౌన్‌లోడ్‌ చేస్తే మన మొబైల్‌ఫోన్‌ సైబర్‌ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన   లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్‌ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్‌ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్‌లోడ్‌ చేసుకుంటే, సైబర్‌ నేరగాళ్లు మీ గూగుల్‌ పే, ఫోన్‌పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్‌ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్‌లైన్‌ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా  ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)