ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Published on Fri, 09/20/2024 - 08:23

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ ఐపీఎస్‌ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే.  ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. 

తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్‌, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. 

ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్‌ ఛానల్‌ ఎండీ శ్రవణ్‌ కుమార్‌పైనా రెడ్‌ కార్నర్‌ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్‌ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)