Breaking News

సర్పంచ్‌: 5,654 వార్డులు: 82,276

Published on Mon, 12/01/2025 - 03:09

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్య లో నామినేషన్లు దాఖలయ్యాయి.  శనివారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్‌లో ఉండటంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఆదివారం తొలివిడత నామినేషన్ల సంఖ్య తేలింది. మొదటి విడతలో 4,236 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 25,654 మంది, 37,440 వార్డులకు 82,276 మంది నామినేషన్లు వేశారు. 

సూర్యాపేట జిల్లాలో సర్పంచ్‌ పదవుల కోసం అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమరి్పంచారు. ఇక్కడ 159 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 262 పంచాయతీల్లో సర్పంచ్‌ల కోసం1,383 నామినేషన్లు వేయగా, మహబూబాబాద్‌లో 155 పంచాయతీలకుగాను 1,239, కామారెడ్డి 167 జీపీలకు 1,224, రంగారెడ్డిలో 174 జీపీలకు 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి.  

వార్డు సభ్యుల విషయానికి వస్తే సీన్‌ మారింది. పంచాయతీలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో వార్డు స్థానాలకు నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కూడా వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకుగాను 4,540, వికారాబాద్‌ 2,198 వార్డులకుగాను 4,379 నామినేషన్లు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 4,041, కామారెడ్డిలో 1,520 వార్డులకు 3,832, సూర్యాపేటలో 1,442 వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి.  

3న నామినేషన్లు ఉపసంహరణ..  
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు. స్రూ్కట్నీ చేసి అభ్యర్థుల జాబితా రూపొందించారు. తిరస్కరించిన నామినేషన్లపై సోమవారం సా యంత్రం వరకు అప్పీల్‌ చేసుకోవచ్చు. మంగళవారం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు.బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యా హ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 11వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది.  

రెండో విడత నామినేషన్లు షురూ 
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుంచి మొదలైంది. అయితే అర్ధరాత్రి వరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రాలేదు. రెండో విడతలో 4,333 సర్పంచ్, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 14న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.   

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు