Breaking News

మందా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్

Published on Mon, 01/13/2025 - 11:33

హైదరాబాద్, సాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన మందా జగన్నాథంకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాళులర్పించారు. చంపాపేటలోని మందా ఇంటికి వెళ్లిన కేటీఆర్‌.. మంధా పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. 

‘‘మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి.  మహాబూబ్‌ నగర్‌ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి  ఆయన. రాజకీయాల్లో వివాదరహితుడు ,సౌమ్యుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారాయన. నాలుగు సార్లు ఎంపీ గా అయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని కేటీఆర్‌ మీడియాతో అన్నారు.

 

అధికారిక లాంఛనాలతో.. 
మందా జగన్నాథం అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రముఖుల సంతాపం
మందా జగన్నాథం మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, సామాజిక తెలంగాణ ఉద్యమకారునిగా రాష్ట్రంలో మందా జగన్నాథం పోషించిన పాత్ర మరువరానిదని అన్నారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. మందా జగన్నాథం మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమానికి, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగన్నాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

మందా ప్రస్థానం
నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన మందా జగన్నాథం.. నాలుగు పర్యాయాలు ఎంపీగా నెగ్గారు. 1996, 1999, 2004 పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి 2009లో కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2014 తరువాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలందించారు. గత లోక్‌సభ ఎన్నికల ముందు బీఎస్‌పీలో చేరారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో నిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)