Breaking News

ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోంది: మంత్రి జగదీశ్‌ రెడ్డి

Published on Fri, 03/17/2023 - 07:40

సాక్షి,సూర్యాపేట: బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధి మించి ప్రవర్తిస్తోందని, చట్టప్రకారం విచారణ జరగడం లేదని విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి' మండిపడ్డారు. గురువారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళను రాత్రి వరకు విచారిస్తామంటే అది ముమ్మాటికీ వేధించడమే, రాజకీయ కక్ష సాధింపు చర్యేనని చెప్పారు. బీజేపీ పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఈడీ పనిచేస్తోందని, విచారణ సంస్థల పేరుతో బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు.

రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారన్నారు. కవిత ఎక్కడికి పారిపోవడం లేదని, విచారణకు సహకరిస్తానని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమేనని జగదీశ్‌రెడ్డి అన్నారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి దేశాన్ని రక్షిస్తామన్నారు.

Videos

గ్యాస్ తాగుతూ బతుకుతున్న ఓ వింత మనిషి

మాధవి రెడ్డి పై అంజాద్ బాషా ఫైర్

ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట

నేడు యాదగిరి గుట్ట, పోచంపల్లిలో అందాల భామల పర్యటన

శత్రు డ్రోన్లపై మన భార్గవాస్త్రం

ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు

మద్యం కేసులో బాబు బేతాళ కుట్ర మరోసారి నిరూపితం

సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?

ఆపరేషన్ సిందూర్ తో మరోసారి లెక్క సరిచేసిన భారత్

Photos

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)