Breaking News

హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్‌

Published on Wed, 09/24/2025 - 07:27

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్మాల్‌(Smita Sabharwal) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.  తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.  

స్మితా సబర్వాల్‌ నాడు సీఎం కేసీఆర్‌(Ex CM KCR) అదనపు కార్యదర్శి హోదాలో పని చేశారు. అయితే కాళేశ్వరం కమిషన్‌ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్టప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు.  ‘కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను బాధ్యురాలిని కాను. అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చానని. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బరాజ్‌ల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించానని కమిషన్‌ పేర్కొంది. 

బరాజ్‌ల నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో నా పాత్ర ఉందని చెప్పింది. సంబంధిత ఫైళ్లను కేబినెట్‌ ఆమోదం కోసం ఉంచనందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు నాపై తీవ్ర చర్యలకు సిఫార్సు చేశారు. కమిషన్‌ నాపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదికను రద్దు చేయాలి’అని స్మిత  పిటిషన్‌లో పేర్కొన్నారు.   ఈ పిటిషన్‌పై ఒకట్రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌(Justice Aparesh Kumar Singh) ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌.. అప్పుడే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)