Breaking News

డీజీపీ నియామకంలో ‘సుప్రీం’ ఆదేశాలు పాటించారా?

Published on Fri, 12/19/2025 - 05:47

సాక్షి, హైదరాబాద్‌: డీజీపీగా బి.శివధర్‌రెడ్డి నియామకంలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డికి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ పూర్తికాల డీజీపీని నియమించే ప్రక్రియను ప్రారంభించాలని సర్కార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామా జిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ గురువారం విచారణ చేపట్టారు. పార్టీ ఇన్‌ పర్సన్‌(పిటిషనర్‌) వాదనలు వినిపిస్తూ.. శాశ్వత నియామకం జరిగేలా చూడటానికి, డీజీపీ పదవీ విరమణకు కనీసం 3 నెలల ముందుగానే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ భర్తీకి ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. అర్హులైన ఐపీఎస్‌ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో సర్కార్‌ విఫలమైందని, తద్వారా శాశ్వత నియా మక ప్రక్రియను పక్కన పెట్టిందన్నారు.  అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. యూపీఎస్సీకి ఒక ప్యానెల్‌ను సమర్పించినట్లు తెలిపారు.

అయితే, కమిషన్‌ అనేక వివరణలు కోరిందని, ఈలోగా కొందరు అధికారుల పదవీ విరమణతో ఈ ప్రక్రియ మ రింత సంక్లిష్టంగా మారిందన్నారు. ప్రస్తుత కేసు లో కో–వారంటో (ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి అధికారాన్ని సవాల్‌ చేసే) రిట్‌ దాఖలు చేయలేరని చెప్పారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్‌ భావిస్తే.. అక్కడే ధిక్కార కేసు దాఖలు చేయాలని నివేదించారు. న్యాయస్థాన ం ఆదేశాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై వివరాలు తెలుసుకుని చెప్పేందుకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరిస్తూ, విచారణ వాయిదా వేశారు.  

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)