ఆ పిల్‌కు నంబర్‌ కేటాయించండి

Published on Fri, 12/12/2025 - 04:12

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దాఖలు చేసిన ప్రజాప్ర యోజన వ్యాజ్యానికి నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌ను ఈ పిటిషన్‌కు జత చేయాలని స్పష్టం చేసింది. ఈ రెండు పిల్‌లపై సీజే ధర్మాసనం వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

పలువురికి ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ శ్రీనివాస్‌ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తిన రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించేందుకు నిరాకరించింది. ఫైలింగ్‌ నంబర్‌పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 2017లో అప్పటి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఇదే ‘కేబినెట్‌ హోదా’ అంశంపై పిటిషన్‌ వేశారని, అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టినా ప్రయోజనం లేదని చెప్పారు. 

రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉండగా ఓ నిర్ణయం తీసుకుంటారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆర్టికల్‌ 164 (1ఏ) ప్రకారం మంత్రివర్గ హోదా కల్పించే విషయంలో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. ప్రస్తుతం 16 మంది కేబినెట్‌ మంత్రులకు అదనంగా ప్రభుత్వంలోని 14 మంది ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు ఆ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమన్నా రు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)