Breaking News

హరీష్‌రావు క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

Published on Fri, 01/10/2025 - 10:01

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీష్‌ రావు క్వాష్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నారు.

కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్‌రావు.. హైకోర్టులో​ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.

పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇక, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్‌ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్‌ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్‌ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
 

 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)