Breaking News

రంగనాథ్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో పెట్టండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Published on Thu, 07/23/2026 - 14:55

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోతుకుంట భూవివాదంలో హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని ఆర్మీని ఆదేశించింది. 

వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవ్వరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే హైడ్రా పనితీరును పలుమార్లు తీవ్రంగా మందలించిన హైకోర్టు, మళ్లీ ఆర్మీ భూములను టచ్ చేస్తే తమకు చెప్పాలని పేర్కొంది.  గురువారం లోతుకుంట భూములపై జరిగిన విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

కమిషనర్‌ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ధిక్కరణ ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోమని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

శాంతిభద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘించి హైడ్రా అధికారులు అక్కడకు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారు వచ్చే హైడ్రా వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)