Breaking News

బడ్జెట్‌పై లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్న తెలంగాణ సర్కార్‌

Published on Mon, 01/30/2023 - 11:03

సాక్షి, హైదరాబాద్‌: లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. గవర్నర్‌ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు లాయర్‌ దుశ్యంత్‌ దవే హైకోర్టుకు తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు.

​కాగా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వర్సెస్‌ తెలంగాణ సర్కార్‌ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బడ్జెట్‌ సిఫార్సులకు ఇంకా గవర్నర్‌ ఆమోద ముద్ర పడని నేపథ్యంలో .. ఆమెకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. అయితే.. ఈ నాటకీయ పరిణామల నడుమ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు సోమవారం హైకోర్టు అనుమతి ఇచ్చింది. 

ముందుగా లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌, హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌ ముసాయిదా ప్రతులకు ఆమోదం తెలపలేదు అని, గవర్నర్‌ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని ఏజీ.. బెంచ్‌ ముందు విజ్ఞప్తి చేశారు. అయితే.. గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకోగలుగుతామని బెంచ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

లంచ్ మోషన్ అనుమతిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అడ్వకేట్ జనరల్ సమాధానంతో.. అందుకు బెంచ్‌ అంగీకరించింది. అయితే పిటిషన్‌ రెడీగా ఉందా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. సిద్ధంగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. అయితే లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)