Breaking News

కొత్త చట్టమే..! భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కారు చర్యలు

Published on Sun, 06/23/2024 - 01:04

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతమున్న ఆర్‌వోఆర్‌ చట్టం ఉపయోగ పడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌–2020) చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. అనేక అంశాల్లో స్పష్టతనిస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ముసాయిదా చట్టం సిద్ధ­మ­వుతోందని, వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపే బిల్లును తీసుకువస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది.  

కొత్త చట్టమే ఉత్తమం! 
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెస్తున్న సందర్భంగా, ఇంతకుముందున్న చట్టం స్థానంలో ఆర్‌వోఆర్‌–2020 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం కోసం నియమించిన ప్రత్యేక కమిటీ ఈ చట్టాన్ని అధ్యయనం చేసింది. ఈ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని, చాలా అంశాలపై ఇది స్పష్టత ఇవ్వడం లేదని, దీని ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

పాత చట్టంలో చేయాల్సిన సవరణల గురించి పలు సిఫారసు­లు చేశారు. లేనిపక్షంలో పూర్తిగా కొత్త చట్టాన్నైనా తీసుకురావాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే లోపభూయిష్టమైన పాత చట్టాని­కి మార్పులు చేయడం కన్నా తమ ముద్ర ఉండే విధంగా కొత్త చట్టాన్ని తీసుకురావడమే సమంజసమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచి్చనట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలోనే పాత చట్టంలోని కొన్ని అంశాలను తీసుకుంటూనే, అవసరమైన కీలక సవరణలు చేస్తూ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌–2024) చట్టాన్ని రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. ముసాయిదా చట్టంపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదించి, ఆ తర్వాత జూలైలో నిర్వహించే బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.  

కీలకాంశాల్లో మార్పులతో.. 
రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్‌వోఆర్‌ చట్టంలోని కీలకాంశాల్లో మార్పులు చేస్తూ కొత్త చట్టం తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా భూసమస్యల పరిష్కారం కోసం పలు స్థాయిల్లోని అధికారులకు ఉండే అధికారాల వికేంద్రీకరణపై కొత్త చట్టంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 

కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు ఎలాంటి అధికారాలు ఇవ్వాలి, ఆయా స్థాయిల్లోని అధికారులు ఎలాంటి నిర్ణయాలకు బాధ్యత వహిస్తారనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్‌–బీలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, సాదాబైనామాల కింద లావాదేవీలు జరిగి పాస్‌ పుస్తకాలు రాని 9 లక్షల ఎకరాల భూములకు పరిష్కారం చూపించే దిశలో చట్టం రూపొందుతోందని తెలుస్తోంది.  

అసైన్డ్, భూదాన్‌ కంగాళీకీ చెక్‌!
అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములకు సంబంధించిన కంగాళీ కూడా లేకుండా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే విధంగా పాత చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తయారుచేస్తున్నారని, రెవెన్యూ ట్రిబ్యునళ్ల పునరుద్ధరణ లాంటి కీలక అంశాలు కొత్త చట్టంలో ఉంటాయని తెలుస్తోంది. 

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాలను జాయింట్‌ సబ్‌ రిజి్రస్టార్‌ హోదాలో తహసీల్దార్లకే ఉంచాలా లేక డిప్యూటీ తహసీల్దార్లకు అప్పజెప్పాలా అన్న దానిపై కూడా కొత్త చట్టంలో స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)