Breaking News

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ

Published on Tue, 02/07/2023 - 12:08

హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌లో మంగళవారం విచారణ జరిగింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా అని కోర్టు ప్రశ్నించగా..ఇంకా నమోదు కాలేదని డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు.

సీబీఐ కేసు నమోదు చేయాలని, కేసు ఫైళ్లు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు పిటిషన్‌ విచారణకు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ నుంచి అనుమతి తీసుకొని రావాలని జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి అడ్వకేట్‌ జనరల్‌కు సూచించారు. దీంతో రేపు ఉదయం సీజే బెంచ్‌లో మెన్షన్‌ చేస్తామని ఏజీ తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఎన్నిరోజులు పడుతుందని సింగిల్‌ బెంచ్‌ ప్రశ్నించగా.. వారం పడుతుందని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

కాగా ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ సీబీఐ విచారణకు అప్పగించాలని ఇచ‍్చిన తీర్పుపై.. తెలంగాణ ప్రభుత్వం. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  నిన్న(సోమవారం) డివిజన్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ వేసింది.

రోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు చుక్కెదురైంది. సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సమయం కోరగా.. అందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్‌ను.. సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలనీ దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించింది హైకోర్టు డివిజన్‌ బెంచ్‌. 

మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం జరిగినట్లు అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేసింది. ఆపై సిట్‌ ద్వారా ఈ కేసు దర్యాప్తును కొనసాగించింది ప్రభుత్వం. అయితే.. కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. సీబీఐకి ఇవ్వొద్దంటూ తెలంగాణ సర్కార్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయినప్పటికీ సర్కార్‌ అభ్యర్థనను డివిజన్‌ బెంచ్‌  తోసిపుచ్చింది దాంతో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది తెలంగాణ సర్కార్‌.

Videos

రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!

అల్లు అర్జున్ తో నిహారిక లవ్ స్టోరీ

కమ్మేస్తోన్న కరోనా కాటేరమ్మ కొడుకునూ వదలని వైరస్

సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ

అందాల పోటీల మీదనే కాదు.. ప్రజల ప్రాణాల మీద దృష్టి పెట్టాలి: కేటీఆర్

గుల్జార్ హౌస్ లో అసలేం జరిగింది?

YSRCP కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన టీడీపీ గూండాలు

ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ BCCI సంచలన నిర్ణయం

ఓటమి భయంతో YSRCP నేతలపై దాడి

Photos

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఏలూరులో ఘనంగా ‘భైరవం’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : 'సూర్య- వెంకీ అట్లూరి' కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు