Breaking News

మూసీలో ముందడుగు.. నిర్వాసితులకు పరిహారం

Published on Thu, 02/12/2026 - 07:20

సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ  మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. 

హైదరాబాద్‌ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌–టీడీఆర్‌) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు. 

పట్టా భూములకు టీడీఆర్‌ సర్టిఫికెట్లు.. 
సుందరీకరణలో సీఎం రేవంత్‌ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్‌ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి బాపూఘాట్‌ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్‌–1ఏలో హిమాయత్‌ సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు 9.2 కి.మీ, ఫేజ్‌–1బీలో ఉస్మాన్‌ సాగర్‌ నుంచి గాంధీ సరోవర్‌ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్‌ సరి్టఫికెట్లను అందజేయనున్నారు.  

సుందరీకరణ ఇలా.. 
ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్‌ ట్రాక్‌లు, భూగర్భ జలాల రీచార్జ్‌ కోసం పార్క్‌లు, వర్షపు తోటలు, గ్రీన్‌రూఫ్‌లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్‌ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్‌ ఎకానమీలో భాగంగా అమ్యూజ్‌మెంట్‌పార్క్, వాటర్‌ ఫాల్స్, చి్రల్డన్స్‌ వాటర్‌ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్‌ స్థలాలను అభివృద్ది చేస్తారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)