Breaking News

నో మీటింగ్స్‌.. నో అపాయింట్‌మెంట్స్‌.. రెండోరోజూ ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి

Published on Tue, 12/16/2025 - 01:49

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండో రోజూ ఢిల్లీలోనే ఉన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన ‘ఓట్‌ చోర్‌–గద్దీ ఛోడ్‌’ మహాధర్నాలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం హైదారాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రేవంత్‌ హాజరుకావాల్సి ఉంది. 

కానీ.. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ తన ప్రయాణం వాయిదా వేసుకున్నారు. ఎంపీలు, ఇతరత్రా ఎవరితోనూ భేటీ కాలేదు. ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనలేదు. 

కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వచ్చిన రేవంత్‌ పూర్తిగా వారితోనే రోజంతా గడిపారు. సాధారణ పరిస్థితులు నెలకొని విమాన ప్రయాణానికి వాతావరణం అనుకూలిస్తే.. మంగళవారం రేవంత్‌ హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారని అధికార వర్గాలు చెప్పాయి. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)