Breaking News

‘ప్లీజ్‌ సార్‌.. నాకూ అవకాశం ఇవ్వండి’

Published on Fri, 03/28/2025 - 10:08

న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్‌ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్‌ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.  

అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది.  తెలంగాణ కేబినెట్‌లో చోటు కోసం  పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్‌ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  తనకు కేబినెట్‌లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం. 

మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా  ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్‌ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

Videos

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

Photos

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)