Breaking News

ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం

Published on Fri, 01/02/2026 - 10:10

ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
తెలంగాణ శాసన సభలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్లు.
మోటర్ వెహికిల్ టాక్సేషన్‌ బిల్లును ఆమోదించిన సభ
ఈ బిల్లుతో పాటు మొత్తం ఐదు బిల్లులకు ప్రభుత్వ ఆమోదం
ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం

హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం: శ్రీధర్ బాబు.. మంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడే సిబ్బంది ఉండేలా చొరవ తీసుకుంటుంన్నాం
గ్రేటర్ హైదరాబాద్ పరిపాలన వికేంద్రీకరణ పై దృష్టి పెట్టాం
హైదరాబాద్ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం
ఉపాధి హామీ పథకం గొప్పతనం ఏంటి మహేశ్వర్ రెడ్డి తెలుసుకోవాలి
మహాత్మాగాంధీ పేరు తొలగించి అవమానించారు
మోడీ, అమిత్ షా కు చాలా సన్నిహితుడు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగేలా మహేశ్వర్ రెడ్డి చొరవ చూపాలి

👉ప్రజాస్వామ్యంలో మాకు కూడా హక్కు ఉంటుంది: తలసాని శ్రీనివాస్
రెండు సంవత్సరాల్లో సభను చూసి అసహహించుకుంటున్నారు
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు ఉండాలి
ప్రశ్నలు అడగకుండా అడ్డగించడం సరికాదు
హైదరాబాద్ కొత్తగా కట్టడానికి వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారు
సభలో మమ్మల్ని అవహేళన చేస్తున్నారు
ప్రధాన ప్రతిపక్షంగా మాకు వాయిస్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నారు
అసెంబ్లీలో రూల్స్ ఫాలో కావాలి.. ముఖ్యమంత్రి పరిధి దాటి మాట్లాడుతున్నారు
రెండేళ్లలో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు
స్పీకర్‌ మా వైపు కూడా చూడట్లేదు
30 ఏళ్ల నుండి సభ చూస్తున్నా.. ఇంతటి దారుణం ఎక్కడ లేదు
గాంధీభవన్ లాగా సభను వాడుతున్నారు
ప్రభుత్వలు శాశ్వతం కాదు.. రాచరిక పాలన కొనసాగిస్తున్నారు

👉అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్‌ఎస్‌
రేపటి నుంచి అసెంబ్లీకి హాజరుకావొద్దని బీఆర్‌ఎస్‌ నిర్ణయం
గన్‌ పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా
స్పీకర్‌ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన
రేపు కృష్ణానదీ జలాలు, పాలమూరు ప్రాజెక్ట్‌పై
పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న బీఆర్‌ఎస్‌

👉మున్సిపాల్టీ సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు
అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌
సీఎం మాట్లాడిన తర్వాత తమకు అవకాశం ఇవ్వలేదని  వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌

👉ప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్‌

మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి
రెండేళ్లలో గండిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తాం
సంక్రాంతి లోగా ఫస్ట్‌ఫేజ్‌పై క్లారిటీ వస్తుంది
ఫస్ట్‌ ఫేజ్‌లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన
ప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారు
కడుపు నిండా విషం నింపుకున్నారు
రేవంత్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అని కొందరు మాట్లాడుతున్నారు
రియల్‌ ఎస్టేట్‌తో నగరం మరింత అభివృద్ధి జరుగుతోంది
మూసీ ప్రక్షాళన జరగాలా? వద్దా? ప్రతిపక్షనేతలు చెప్పాలి
మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారు
ప్రతిపక్ష  నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?

👉మా సర్కార్‌ వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం: సీఎం రేవంత్‌

మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు
సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం
నదీ పరివాహక ప్రాంతాల్లోనే నిర్మాణాలు జరిగాయి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు
నిజాం ప్రభువు నిర్మించిన ప్రాజెక్ట్‌ ద్వారా నగరానికి నీరు అందుతోంది
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది
ఫామ్‌ హౌస్‌ల డ్రైనేజీలు గండిపేటలో కలిపారు
మా ప్రభుత్వం వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం

👉మండలిలో కవిత చిట్‌చాట్
రాజీనామా చేసి నాలుగు నెలల కాలం గడిచిపోయింది
నాలుగు నెలలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి
నా రాజీనామా ను ఆమోదించాలని చైర్మన్‌ను కోరడానికి మండలికి వచ్చా
ఫ్లోర్‌లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని  చైర్మన్‌ను కలిసి కోరతా..
కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలి..
రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకు రేవంత్ రెడ్డినే రెండు సార్లు ఉరి తీయాలి
కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
కేసీఆర్‌ను తిడుతుంటే కూతురిగా నాకు రక్తం ఉడుకుతుంది

👉మూసీ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది?: హరీష్‌రావు

మూసీ ప్రాజెక్టులో ఎన్ని నివాసాలను కూల్చారు?
కూల్చిన ఇండ్లకు ఇప్పటి వరకు పునరావాసం ఎంత కల్పించారు?
మూసీకి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా? లేదా
మొన్న వరదలు వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేదా?
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తది.
మూసీలో ఖాళీ స్థలాలు ఉన్నాయి.. అక్కడ అభివృద్ధి చేయాలి

👉అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మండలికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
తన రాజీనామాను ఆమోదించాలని మండలి  చైర్మన్ ను కోరనున్న కవిత

👉మూసీకి-మీరాళంకు సంబంధం ఏంటి?: అక్బరుద్దిన్ ఓవైసీ

రెండు మూడు అంశాలను క్లబ్ చేస్తే ఎలా?
అసెంబ్లీ అధికారులు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు
సభ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి
రెండేళ్ల నుంచి మూసి పేరుతో కాలం గడుపుతుంది
మూసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అసలు మూసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?
నాకు తెలిసినంత వరకు అనంతగిరి నుంచి ప్రారంభం అవుతుంది
ప్రభుత్వం అనంతగిరి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటుందా? లేదా?
మూసీ లో ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది?
గోదావరి నీళ్లను హిమాయత్, ఉస్మాన్ సాగర్‌లో ఎలా తెస్తారు?
హిమాయత్ సాగర్, హుస్మాన్ సాగర్ కాచిమెంట్ ఏరియా ఎంతో చెప్పాలి?
గతసారి అవసరం లేకుండా హిమాయత్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచారు?
ఈ రెండు సాగర్లలో వర్షపు నీళ్లు వస్తాయి.. మరి గోదావరి నీళ్లు తెస్తే ఎలా?
మూసీ ప్రాజెక్ట్ బాబు ఘాట్ వరకు విన్నాను.. కానీ ప్రాజెక్టు వివరాలు సర్కార్ చెప్పడం లేదు.

శాసన మండలి:
👉గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

  • బలహీన వర్గాల సంక్షేమంపై గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు
  • 13 కార్పొరేషన్లు ఉండేవి.. తరువాత 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశాం
  • స్థలాల సేకరణ చేశాం.. వాటి అభివృద్ధికి నిధులు కేటాయించలేదు
  • నిధులు పేపర్‌కే తప్ప గతంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు
  • గొల్ల కురుమ భవన్‌కు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తన సొంత నిధులతో ఆ భవనాన్ని నిర్మించారు
  • ప్రభుత్వం ఏర్పడిన తరువాత బలహీనవర్గాల మంత్రిగా అన్ని కుల సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం
  • కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎడ్యుకేషన్,స్కిల్స్ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం
  • బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది
  • బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరిగేలా మా కార్యాచరణ ఉంది
  • పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం
  • సమగ్రమైన ప్రణాళికతో కొత్త కార్పొరేషన్లకు శాశ్వత సిబ్బందిని నియమిస్తాం
  • ధోబీ, కుమ్మరి ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంటున్నాం
  • గీత కార్పొరేషన్ కాటమయ్య రక్షణ కవచాలు ఇస్తున్నాం
  • బలహీన వర్గాల శాఖ మంత్రిగా సామాజిక న్యాయం జరగడానికి రాజకీయాలు అతీతంగా పని చేస్తాం

ప్రశ్నోత్తరాల సమయం:

  • హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్ సాగర్‌లోకి పంప్‌ చేయడానికి ఏర్పాట్లు: శ్రీధర్‌బాబు
  • త్వరలోనే డీపీఆర్‌లు తయారు చేస్తాం
  • హిమాయత్‌ సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు అధ్యయనం
  • మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగింది. యూరియా కొరతపై చర్చ జరపాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం చేయగా.. స్పీకర్‌ తిరస్కరించారు. బీఆర్‌ఎస్‌ నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏదైనా డిమాండ్ ఉంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రావాలన్నారు. ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేయడం సరైన పద్ధతి కాదని శ్రీధర్‌బాబు అన్నారు.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు