ఫార్ములా-ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌.. ఏసీబీ కేసు నమోదు

Published on Thu, 12/19/2024 - 16:26

సాక్షి,హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేసు నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలంటూ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.

ఈ క్రమంలో తాజాగా గురువారం(డిసెంబర్‌ 19) ఈ-కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏ1గా, అప్పటి మునిసిపల్‌ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఏ2గా చేరుస్తూ ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో ఏ3గా అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఏసీబీ చేర్చింది.  కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్టు) 13(1)ఏ, 13(2)తో పాటు బీఎన్‌ఎస్‌ చట్టంలోని  పలు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఫార్ములా ఈ-కార్‌ రేసుల కోసం ఓ విదేశీ కంపెనీకి అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఆదేశాలతో కేబినెట్‌ అనుమతి లేకుండానే రూ.45 కోట్ల ఇండియన్‌ కరెన్సీ చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇందుకు ఆర్బీఐ రూ.8 కోట్లు ఫైన్‌ వేయగా తమ ప్రభుత్వం జరిమానా చెల్లించిందని తెలిపారు.  

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఫార్ములా ఈ కార్‌ రేసులు నిర్వహించారు. ఈ రేసులకు అప్పటి మునిసిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి అయిన కేటీఆర్‌పై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్‌ అనుమతి కూడా తీసుకోవడం గమనార్హం.  

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఏసీబీ FIR నమోదు

‌హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్‌

  • తనపై నమోదైన ఫార్ములా ఈ కార్ల కేసులో క్వాష్‌ పిటిషన్‌ వేసే యోచనలో కేటీఆర్‌ 

  • రేపు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసే అవకాశం 

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదైనందున క్వాష్‌ పిటిషన్‌ వేసేందుకు అవకాశం 

  • న్యాయ నిపుణులతో ఇప్పటికే కేటీఆర్‌ చర్చలు 

ప్రభుత్వం అబద్ధాలు చెప్తూ కేసు పెట్టింది: హరీశ్‌రావు 

  • రాష్ట్రం కోసం పనిచేసిన కేటీఆర్‌పై కేసు పెట్టారు

  • ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలు 

  • ఫార్ములా ఈ కేసుపై అసెంబ్లీలో చర్చించండి 

     

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)