Breaking News

ప్రభుత్వ బడుల్లో టెక్‌ కోర్సులు

Published on Mon, 06/16/2025 - 05:50

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. 

ప్రముఖ వాణిజ్యవేత్త నందన్‌ నీలేకని సారథ్యంలోని ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్, డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్‌ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌వాలా, ఖాన్‌ అకాడమీ, షోయబ్దార్‌ నిర్వహిస్తున్న పైజామ్‌ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్‌ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. 

ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఈ సంస్థలు అందించే సేవలివీ.. 
–ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతోపాటు మ్యాథ్స్‌పై బేసిక్స్‌ను అందిస్తుంది.  

–ఫిజిక్స్‌వాలా ఇంటర్మీడియట్‌ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్‌ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది.  

–ఖాన్‌ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌పై శిక్షణ ఇస్తుంది. 

–ప్రజ్వల ఫౌండేషన్‌ 6వ తరగతి నుంచి క్లాస్‌ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.  

–పైజామ్‌ ఫౌండేషన్‌ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్‌ మరియు కంప్యూటేషనల్‌ థింకింగ్‌పై శిక్షణ ఇస్తుంది.  

–ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)