Breaking News

నిద్ర భంగం చేశారని విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు 

Published on Sat, 03/11/2023 - 11:50

సాక్షి, హైదరాబాద్‌: తన నిద్ర భంగం చేశారని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి విద్యార్థులను స్కేలుతో చితకబాదాడు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేష్‌ రేణుకల కుమారుడు ఆశీష్‌కుమార్‌ మడ్‌ఫోర్ట్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో రవికుమార్‌ అనే ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రిస్తున్నాడు.

విరామం అనంతరం విద్యార్థులు తరగతి గదికి రాగా శబ్ధం రావడంతో నిద్ర భంగమైందని కోపోద్రిక్తుడైన రవికుమార్‌ స్కేల్‌తో పలువురు విద్యార్థులతో పాటు తన టేబుల్‌ దగ్గర ఉన్న ఆశీష్‌కుమార్‌ పిక్కలు, మోకాలి కింది భాగంలో కొట్టాడు. ఈ విషయం సదరు విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పలేదు.

శుక్రవారం స్నానం చేయించే సమయంలో తల్లి నల్లగా కమిలినట్లు ఉండటం గమనించి ఆరా తీయగా ఉపాధ్యాయుడు కొట్టినట్లు తెలిపాడు. పాఠశాలకు వెళ్లి నిలదీయగా తాను కొట్టలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మిగతా విద్యార్థులు సైతం తమని కూడా కొట్టాడని చెప్పడంతో శుక్రవారం కార్ఖాన పీఎస్‌లో రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)