Breaking News

MLC Kavitha-ED Investigation: హా­జ­రు­పై ఉత్కంఠ!

Published on Mon, 03/20/2023 - 00:46

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హా­జ­రు­పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 16న జరగాల్సిన ఈడీ విచారణకు కవిత వెళ్లకపోవడం.. తన న్యాయవాది ద్వారా సమాచారం, డాక్యుమెంట్లు పంపడం.. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌పై 24న విచారణ జరిగేదాకా ఈడీ విచారణ ఆపాలని అధికారులకు లేఖ రాయడం.. అయినా కూడా 20న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు ఇవ్వడం నేపథ్యంలో అన్నివర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

అంతేగాకుండా ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న కవిత విజ్ఞప్తిని.. చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం తిరస్కరించడం హాట్‌ టాపిక్‌గా మారింది. కవిత ఈడీ విచారణకు హాజరైతే ఏం జరు­గు­తుంది? ఒకవేళ హాజరుకాకపోతే ఈడీ ఎలా స్పంది­స్తుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో మరింత టెన్షన్‌ రేపుతోంది. ఈ క్రమంలో సోమవారం కవిత ఈడీ విచార­ణకు హాజరవుతారా? లేక మొన్నటిలా న్యాయవాదిని తన ప్రతినిధిగా పంపుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. 

ఢిల్లీకి చేరుకున్న కవిత 
సోమవారం (20న) విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆదివా­రం సాయంత్రమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కవిత వెంట ఆమె భర్త అనిల్‌తోపాటు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, కొందరు సన్నిహిత అనుచరులు ఉన్నట్టు సమాచారం.

అధికారులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒకరోజు ముందే కవిత ఢిల్లీకి చేరుకున్నా.. విచారణకు హాజరయ్యే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలిసింది. న్యాయ నిపుణుల సలహాలకు అనుగుణంగానే నడుచుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 

ప్రతీసారి ఊహాగానాలతో.. 
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత మూడో పర్యాయం ఢిల్లీకి చేరుకోగా.. ప్రతీసారి ఆమెను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు, కేటీఆర్‌ సహా మంత్రులు, సన్నిహితులు వెంట రావడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.  

‘సుప్రీం’ నిర్ణయం తేలిన తర్వాతే..? 
ఈ నెల 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్‌ వి­చా­రణకు రానున్న నేపథ్యంలో.. సోమవారం కూ­డా కవిత తన న్యాయవాది లేదా ప్రతినిధి ద్వా­రా ఈడీకి సమాచారం పంపే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఈడీ విచారణకు హా­జ­రు­కాని పక్షంలో ఎదురయ్యే పరిణామాల­పై­కవి­త ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని.. ని­బంధనల మేరకు విచారణ జరగడం లే­దంటూ సు­ప్రీం­కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అదే వా­దనకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారని తెలిసింది.

సుప్రీం ఏం చెప్తుందనే అంశా­న్ని చూ­శాకే ఈడీ ఎదుట హాజరవడంపై నిర్ణ­యం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్ర­మంలో న్యాయ నిపుణులతో జరిగే సంప్రదింపు­­ల్లో సహకరించేందుకే కవితతోపాటు మంత్రి కేటీ­ఆర్‌ ఢిల్లీకి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)