Breaking News

సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. పిటిషన్‌ డిస్మిస్‌

Published on Fri, 10/20/2023 - 11:45

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు(కారు)ను పోలిన ఇతర గుర్తులను కేటాయించవద్దని దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్బంగా ఓటర్లకు అన్నీ తెలుసని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

వివరాల ప్రకారం.. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు కేటాయించే గుర్తు(ఉచిత గుర్తులు) విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్‌, చపాతి మేకర్‌ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని బీఆర్‌ఎస్‌ కోర్టును విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధ‍ర్మాసనం.. పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్బంగా జస్టిస్‌ అభయ్‌ ఓకా నేతృత్వంలోని ధర్మసనం బీఆర్‌ఎస్‌ వాదనలను కొట్టివేసింది. కారు, రోటీ మేకర్‌ గుర్తులకు తేడా తెలుసుకోలేనంత అమాయకులు ఓటర్లు కాదని వ్యాఖ్యానించింది. ఓటర్లకు అన్నీ తెలుసని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను కేటాయించారు. ఇక, ఎన్నికల్లో ఈ గుర్తుకు వేల సంఖ్యలో ఓట్లు పోలయ్యారు. ఒక రకంగా బీఆర్‌ఎస్‌ కారు గుర్తును సదరు గుర్తులు దెబ్బకొట్టినట్టు అధికార పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో గుర్తుల విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఇది కూడా చదవండి: నేడు బీజేపీ తొలి జాబితా.. 70 స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్‌!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)