Breaking News

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్‌

Published on Sat, 01/03/2026 - 16:25

సాక్షి, హైదరాబాద్‌/వైఎస్సార్‌: వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని(Sudheer Reddy) తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్‌ రెడ్డి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్‌ రెడ్డికి డ్రగ్స్‌ టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం ఈగల్‌ టీమ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే డ్రగ్స్‌(గంజాయి) సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో, సుధీర్‌కు డ్రగ్స్‌ టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం, సుధీర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి.. డీఅడిక్షన్‌ సెంటర్‌కు పంపించారు. 

ఈ క్రమంలో సుధీర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇక, గతంలో కూడా సుధీర్‌ రెడ్డి రెండు సార్లు డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడటం గమనార్హం. ఇదిలా ఉండగా.. సుధీర్‌ రెడ్డి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. డ్రగ్స్‌ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

TS: సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు