Breaking News

కాపాడాల్సిన పోలీసే కాటేశాడు..!

Published on Sat, 08/01/2026 - 13:41

వరంగల్‌ క్రైం: సోషల్‌ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్‌ 2014 బ్యాచ్‌కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. సోషల్‌ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్‌ బుక్‌ ద్వారా శ్రీకాంత్‌ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. 

అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్‌ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్‌కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్‌ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్‌కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్‌ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌కుమార్‌ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)