ఉదయ రాగం.. నాన్న యోగం!

Published on Sun, 06/21/2026 - 09:35

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు నగర జీవనశైలిలో నాన్న అంటే.. ఉదయం ఇంటినుంచి బయలుదేరి, ట్రాఫిక్‌తో పోరాడి, ఆఫీస్‌ బాధ్యతలు మోసి, రాత్రి అలసటతో ఇంటికి చేరే వ్యక్తి. పిల్లలతో గడిపే సమయం ‘వీకెండ్‌ ఆప్షన్‌’గా మిగిలేది. కానీ.. ఇప్పటి నాన్నలు కొంచెం విభిన్నంగా, వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఉన్న సమయాన్ని అనువుగా వినియోగించుకుంటూ ఆరోగ్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల వైపు కొత్తదారులు వెతుక్కొంటున్నారు.

ఇటీవలి కాలంలో ఉదయపు పార్కులు, అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌లు, కమ్యూనిటీ హాళ్లలో పిల్లలతో కలిసి యోగా మ్యాట్‌పై కనిపిస్తున్నారు. ఐటీ, ఫార్మా, స్టార్టప్‌ల హబ్‌గా పేరొందిన కార్పొరేట్‌ నగరంలో పని ఒత్తిడి సహజం. ఈ పరుగుల మధ్య తండ్రితనం కూడా ఒక ‘రెస్పాన్సిబిలిటీ లిస్ట్‌’గా మారడంతో ఉదయాన్నే యోగాతో పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటు మానసికంగా, అటు శారీరక మేలు కోసం అన్నింటికీ మించి పిల్లలకు సమయం ఇవ్వాలనే కోరిక దీనికి ప్రధాన కారణం. నేడు ఫాదర్స్‌ డే, యోగా డే రెండూ ఒకే రోజున కలిసి రావడం యాదృచ్ఛికమే అయినప్పటికీ ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఇలా నాన్న– పిల్లలు నిత్యం చేస్తున్న యోగా వీడియోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వారికి ఫాలోవర్స్‌ కూడా పెరుగుతున్నారు.  

డాడ్‌– కిడ్‌ యోగా రీల్స్‌.. 
యోగా.. ఇక్కడ కేవలం ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ కాదు.. ఇది ఒక న్యూ ఏజ్‌ ఫాదర్‌హుడ్‌ స్టేట్‌మెంట్‌. ‘శ్వాసపై దృష్టి పెట్టడం, నిశ్శబ్దాన్ని వినడం, శరీరంతో పాటు మనసును సర్దుకోవడం’ ఈ అలవాట్లు తండ్రులను మరింత సమతుల్యంగా మార్చుతున్నాయి. పిల్లలతో కలిసి సూర్య నమస్కారాలు చేయడం, ప్రాణాయామం నేర్పడం.. ‘క్వాలిటీ టైమ్‌’ కొత్త నిర్వచనం ఇస్తున్నాయి. ఫలితంగా తండ్రి–పిల్లల మధ్య సంభాషణ పెరుగుతోంది. డిజిటల్‌ యుగంలో ఈ మార్పు డాడ్‌–కిడ్‌ యోగా రీల్స్, ఫ్యామిలీ ఫిట్‌నెస్‌ చాలెంజ్‌లుగా ట్రెండ్‌ అవుతున్నాయి. పిల్లలు తండ్రిని కేవలం సంపాదించే వ్యక్తిగా కాకుండా, మార్గదర్శిగా చూడటం మొదలుపెడుతున్నారు. నాన్నలు సమయమిచ్చి పిల్లలతో కలిసి యోగా చేయడమే నిజమైన ఫాదర్స్‌ డే గిఫ్ట్‌ అని చెబుతున్నారు.

కూతురుతో కలిసి యోగా ఆనందకరం
ఉద్యోగం, బిజీబిజీ నగర జీవన శైలితో అలసిపోయే నాకు యోగాతో ఒక చక్కని పరిష్కారంతో పాటు నాన్నగా కూతురుతో అద్భుత క్షణాలను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది. ఇది అలవాటుగా మారకముందు మా దినచర్య వేరేలా ఉండేది. కానీ.. ప్రస్తుతం వినోదం, వి/ê్ఞనం, ఆరోగ్య వికాసం.. ముఖ్యంగా నాన్నగా ఆతీ్మయ సంతృప్తి పొందుతున్నా. మొబైల్స్, టీవీలకు అతుక్కు పోయే బాల్యం ఇలా నాన్నతో, ఆరోగ్యంగా కొనసాగడం సంతోషంగా ఉంది. నా పాప అని్వక కూడా అందరి పిల్లల్లా కాకుండా వినూ త్న ఆలోచనా విధానంతో పెరుగుతోంది. – నవీన్‌ కుమార్, సరూర్‌నగర్‌

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)