Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

Published on Wed, 07/30/2025 - 08:08

గచి్చబౌలి/మణికొండ: కుమార్తెలను స్కూల్‌ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దుర్మరణం పాలైన ఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.వెంకన్న తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం, కొండముదుసుపాలెంకు చెందిన దంపతులు వెంకటేశ్వర్లు, ఇరువురి శాలిని(38) మణికొండలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. 

మూడు రోజుల క్రితం పిల్లలతో కలిసి వైజాగ్‌ వెళ్లగా వెంకటేశ్వర్లు విజయవాడలో ఆగిపోయారు. కుమార్తెలను తీసుకొని శాలిని సోమవారం రాత్రి మణికొండకు వచ్చింది. భారతీయ విద్యాభవన్‌లో పెద్ద కుమార్తె సుదీక్ష 9వ తరగతి, చిన్న కుమార్తె సహస్ర 4వ తరగతి చదువుతున్నారు. మంగళవారం ఉదయం స్కూల్‌ బస్సు వెళ్లిపోవడంతో ఇద్దరు కూతుళ్లను స్కూటీపై తీసుకెళ్లి ముందు స్టాప్‌లో బస్సు ఎక్కించింది. 

ఉదయం 8.45 గంటలకు స్కూటీపై తిరిగి వస్తుండగా మణికొండలోని సుందర్‌ గార్డెన్‌ ఎదురుగా వెనక నుంచి అతి వేగంగా వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ స్కూటీని ఢీ కొట్టింది. కిందపడిపోయిన శాలిని తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతి వేగంగా ట్యాంకర్‌ నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మృతురాలి సోదరుడు లోకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోడ్డులో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)