Breaking News

వెనక్కి తగ్గని ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు

Published on Fri, 04/18/2025 - 09:07

హైదరాబాద్‌,సాక్షి: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో మార్ఫింగ్‌ ఫొటోను రీ ట్వీట్ చేసిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌కు (Smita Sabharwal) తెలంగాణ పోలీసులు (telangana police) నోటీసులు ఇచ్చారు. అయితే, పోలీసులు నోటీసులు ఇచ్చిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్‌లను రీట్వీట్‌లు చేస్తున్నారు.

కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli row) ఇష్యూకు సంబంధించి పలువురు నేతలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పోస్టుల్ని డిలీట్‌ చేస్తున్నారు. కానీ ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వరుస ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా, ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లపై వరుసగా రెండోరోజు రీపోస్ట్ చేశారు. వాటిల్లో 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీం ఆదేశాలు ఉన్న ఫొటో ఉంది. 

 


మరో పోస్టులో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికే నోటీసులిస్తరా? ఇది దేనికి సంకేతం?’ అంటూ ఓ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును రీపోస్ట్ చేశారు. 

ఏఐతో క్రియేట్ చేసిన బుల్డోజర్లు, నెమళ్లు, జింకలు ఉన్న రెండు పోస్టులను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేయడం. ఆ పోస్టులకు వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడం..అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ట్వీట్లను రీట్వీట్‌ చేయడంపై స్మితా సబర్వాల్ తీరుపై ఐఏఎస్ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)