Breaking News

పేపర్‌ లీక్‌పై రేవంత్‌ సంచలన ఆరోపణలు.. ట్విస్ట్‌ ఇచ్చిన సిట్‌!

Published on Mon, 03/20/2023 - 14:28

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కార్‌పై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం ‍వ్యక్తం చేస్తున్నారు.

దీంతో, ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్‌.. దూకుడు పెంచింది. ఆరోపణలు చేసిన పొలిటికల్‌ లీడర్లకు నోటీసులు అందజేస్తోంది. తమ వద్ద ఉన్న ఆధారాలను అందించాలంటూ సిట్‌ వారిని కోరింది. దీంతో, పేపర్‌ లీక్‌ అంశం ఆసక్తికరంగా మారింది. 

పేపర్‌ లీక్‌ విషయంలో ఆరోపణలు చేస్తున్న పొలిటికల్‌ లీడర్లకు నోటీసులు ఇచ్చి.. వారి వద్ద ఆధారాలని పేర్కొంది. ఇక, పేపర్‌ లీక్‌ వ్యవహారంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకే మండలంలో వంద మందికి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. అయితే, రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను సిట్‌ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, రేవంత్‌ వద్ద ఉన్న ఆధారాలను తమకు అందించాలని సిట్‌ ఏసీపీ కోరారు. ఇక, రేవంత్‌ ఇటీవలే పేపర్‌ లీక్‌ అంశంలో కేటీఆర్‌ పీఏ తిరుపతి పాత్ర కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు, వివరాలు కూడా ఇవ్వాలని సిట్‌ పేర్కొంది. 

ఇది కూడా చదవండి: మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్, రాజశేఖర్‌కు బెదిరింపులు: రేవంత్ రెడ్డి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)