Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం.. హరీష్‌ రావుకు నోటీసులు

Published on Mon, 01/19/2026 - 20:55

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావుకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు(మంగళవారం) జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది. 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలిలోని హరీష్‌ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, హరీష్‌ ఇంట్లో లేని సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. హరీష​ కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా కేసు విషయమై రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారణకు రావాలని పేర్కొన్నారు. దీంతో, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు మరో టర్న్‌ తీసుకుంది. 

అయితే, గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంలో విచారణ జరగ్గా.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇప్పుడు సిట్ నోటీసులు ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా.. జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును  వీసీ సజ్జనార్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)