Breaking News

సీబీఐ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టులో సిట్‌

Published on Tue, 04/11/2023 - 18:25

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజ్‌ కేసులో తమ దర్యాప్తు సజావుగానే సాగుతోందని, సీబీఐ అవసరం లేదని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(SIT) తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పేపర్‌ లీకేజ్‌ కేసులో దర్యాప్తు రిపోర్ట్‌ను మంగళవారం హైకోర్టుకు సమర్పించింది సిట్‌. ఆ స్టేటస్‌ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించింది. 

ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌తో పాటు ఎంక్లోజర్స్‌ను సైతం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సిట్‌. ‘‘పేపర్‌ లీక్‌ కేసులో.. రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించాం. పేపర్‌ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్‌ చేశాం. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించాం. సాక్షులు, నిందితులు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, కమిషన్‌ మెంబర్‌ను సైతం ప్రశ్నించాం. వాళ్ల నుంచి సేకరించిన స్టేట్‌మెంట్స్‌ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాం. 

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చాం. కానీ, పొలిటికల్‌ లీడర్స్‌ నుంచి ఎలాంటి కీలక సమాచారం అందలేదు. గతంలో ఎన్నో సెన్సేషన్‌ కేసుల్ని డీల్‌ చేశాం. ఈ పేపర్‌ లీక్‌ కేసును సైతం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి.. ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదు. కేసులో కీలకమైన ఎఫ్‌ఎస్‌ఎల్‌(FSL) రిపోర్ట్‌ రావాల్సి ఉంది. అది వస్తే.. కేసులో మరింత పురోగతి సాధించొచ్చు అని హైకోర్టుకు సమర్పించిన కేసు స్టేటస్‌ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. 

ఇదీ చదవండి: బండి సంజయ్‌ మూడు సింహాల ప్రమాణంపై రియాక్షన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)