Breaking News

తెలంగాణ హైకోర్టులో జనసేనకు చుక్కెదురు

Published on Tue, 06/02/2026 - 13:20

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జనసేన పార్టీకి చుక్కెదురైంది. ‘నవనిర్మాణ సభ’కు అనుమతి నిరాకరించిన పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో ఆ పార్టీకి మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. అత్యవసర విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో నవనిర్మాణ పేరిట సభ నిర్వహణకు జనసేన ప్రయత్నించింది. అయితే తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ వ్యాఖ్యలు, ఇక్కడి రాజకీయ నేతల ఖండన, తాజా రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 

నిన్న కోర్టు సాధారణ సమయం ముగిసిన తర్వాత పోలీసుల నుంచి జనసేనకు తిరస్కరణ సమాచారం వెళ్లింది. దీంతో చేసేది లేక ఇవాళ అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసి విచారణ జరపాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి కేవియెట్‌ దాఖలు చేశారు. తమ వాదనలు వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టును కోరారు.

ఇరు పక్షాల అంశాలను పరిశీలించిన హైకోర్టు.. జనసేన వేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. దీంతో నవనిర్మాణ సభ నిర్వాహణ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫోకస్‌ అంతా సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ నిర్వహించబోయే ప్రెస్‌మీట్‌ మీద కేంద్రీకృతమైంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)