Breaking News

మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

Published on Sun, 09/29/2024 - 20:55

సాక్షి,హైదరబాద్‌ : మెట్రో రైల్ రెండో దశ పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీట‌ర్ల‌లో మెట్రో రెండు ద‌శ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్య‌యంతో మెట్రో రైలు రెండో ద‌శ చేప‌ట్ట‌నున్నారు. రెండో ద‌శ‌లో కొత్త ఫ్యూచ‌ర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయ‌నున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ వ‌ర్సిటీ వ‌ర‌కు 40 కి.మీ. మేర మెట్రో మార్గాన్ని నిర్మించ‌నున్నారు. ఇటీవ‌లే మెట్రో రైలు రెండో ద‌శ డీపీఆర్‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్షించారు.

ఎయిర్‌పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ మార్పులు చేశారు. ఆరాంఘ‌ర్ – బెంగ‌ళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో ఖ‌రారు చేశారు. నాగోల్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు 36.6 కిలోమీట‌ర్ల మార్గానికి ఆమోదం తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌ కారిడార్‌లో 1.6 కిలోమీట‌ర్ల మేర భూగ‌ర్భంలో మెట్రో వెళ్ల‌నుంది.

రూ. 8 వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో ఫోర్త్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుమతుల కోసం త్వ‌ర‌లోనే మెట్రో రెండో ద‌శ డీపీఆర్‌లు పంప‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో 3 కారిడార్ల‌లో 69 కి.మీ. మేర మెట్రో న‌డుస్తుంది. రెండో ద‌శ‌లో మ‌రో 6 కారిడార్ల‌లో 116.2 కి.మీ. మేర మెట్రో ప్ర‌యాణించ‌నుంది. రెండో ద‌శ పూర్త‌యితే మొత్తం 9 కారిడార్ల‌లో 185 కి.మీ. మెట్రో ప‌రుగులు తీయ‌నుంది.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)