Breaking News

‘రైతు వేదిక’లు ఇక ప్రజా వేదికలు

Published on Mon, 05/22/2023 - 05:52

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతు వేదిక’లు ఇక నుంచి ‘ప్రజా వేదిక’లుగా రూపాంతరం చెందనున్నాయి. రైతులకు సంబంధించిన సమావేశాలే కాకుండా ఇతర ప్రభు­త్వ లబ్ధిదారులకు సంబంధించిన మీ­టిం­­గులు పెట్టుకునేలా వీలు కల్పిస్తూ వ్య­వసాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ శాఖలూ తమ కార్యక్రమాలను రైతు వేదికగా ప్రజలకు తెలియజేసేందు­కు ఏర్పాట్లు చేసుకోవచ్చు.

ప్రభుత్వ పథ­క లబ్ధిదారులందరినీ రైతు వేదికల వద్ద­కు పిలిచి వారికి అవగాహన కల్పించొ­చ్చు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆ­స­రా పింఛన్లు తదితర పథకాలపై అవగాహన కల్పించాలంటే ఇక రైతు వేదికలనే కేంద్రంగా చేసుకోవ­చ్చు. ఆ మేరకు మండల అధికారులు చ­ర్య­లు తీసుకోవాలని, వాటిని ఉప­యో­గిం­చుకోవాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేసింది. 

వినియోగంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే... 
వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలన్న ప్రధా­న లక్ష్యంతో పాటు సాంకేతిక వ్యవ­సాయంతో పాటు వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభు­త్వం రైతు వేదికలకు రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,601 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. ఒక్కో రైతు వేదిక­కు ప్రభుత్వం రూ.12 లక్షలు ఖర్చు చేసింది. మైకులు, కుర్చీలు, ఇతర మౌ­లిక సదుపాయాలతో వీటిని సుందరంగా తీర్చిదిద్దారు.

అయితే ఇప్పటివరకు అనుకున్నంత స్థాయిలో రైతు వేదికలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదన్న భావన సర్కారులో నెలకొంది. అందుకోసం ఇకపై అన్ని ప్రభుత్వ శాఖలు కూడా వీటిని వినియోగించుకోవాలని సూచించింది. వీటిని నిత్యం ఏదో ప్రభుత్వ కార్యక్రమం జరిగే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నదే ప్రస్తుత నిర్ణయంలోని ఉద్దేశం. 

ప్రైవేట్‌ కార్యక్రమాలకూ ఇవ్వాలన్న ప్రతిపాదనలు... 
మండలానికి మూడు నాలుగు చొప్పున రైతు వేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు వేదికలను ఆదాయ కేంద్రాలుగా మార్చాలని జిల్లాల్లోని కొందరు ప్రజాప్రతినిధులు వ్యవసాయశాఖ దృష్టికి తీసుకొచ్చారు. పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలయాలకు ఇవ్వడం వల్ల ఆయా కేంద్రాలకు ఆదాయం సమకూరుతుందని, దీనివల్ల రైతు వేదికల నిర్వహణ భారం ప్రభుత్వంపై ఉండదని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై ప్రభుత్వ వర్గాల్లో మాత్రం భిన్నమైన అభిప్రాయం నెలకొంది. అలా చేయడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతుందని అంటున్నారు. గతంలో ఒకట్రెండు చోట్ల ప్రభుత్వం దృష్టికి రాకుండానే రైతు వేదికలను పెళ్లిళ్లకు ఇచ్చారన్న ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుతానికి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ కార్యక్రమాలు, ఫంక్షన్లకు ఇవ్వొద్దని నిర్ణయించారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)