Breaking News

పాత ప్రాజెక్టులకే పచ్చజెండా 

Published on Sat, 02/04/2023 - 01:58

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లోని రైల్వే పద్దులో మోదీ ప్రభుత్వం ఈసారి తెలంగాణకు కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. కనీసం కొత్త లైన్లు, సర్వేలను సైతం ప్రస్తావించలేదు. కేవలం పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులతోనే సరిపెట్టింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపులు మెరుగ్గా ఉండటం ఊరటనిచ్చే అంశం.

ఈసారి దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ. 8,349.75లతో పోలిస్తే 60 శాతం ఎక్కువ. ఇందులో తెలంగాణ పరిధిలోని ప్రాజెక్టులు, ఇతర పనులకు రూ. 4,418 కోట్లు లభించాయి. ఈ మొత్తం గతేడాది కేటాయింపు (రూ. 3,048 కోట్లు)ల కంటే 45 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకే వచ్చే ఏపీలో జరుగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం రూ. 8,406 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపు (రూ. 7,032)ల కంటే 20 శాతం ఎక్కువ.  

గతం కన్నా రూ. 5,437 కోట్లు ఎక్కువ.. 
ఈసారి దక్షిణమధ్య రైల్వే జోన్‌కు గత బడ్జెట్‌ కంటే ఏకంగా రూ. 5,437 కోట్లు ఎక్కువగా కేటాయించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు జోన్‌ పరిధిలోకి వచ్చే కర్ణాటక, మహారాష్ట్రలో రైల్వే లైన్ల ఏర్పాటుకు కూడా ఈ కేటాయింపులు ఊతమిస్తాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులతోపాటు జోన్‌ పరిధిలో మరో 105 స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నాం. నగరానికి అత్యంత కీలకమైన ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తి చేసేలా ఏకంగా రూ. 600 కోట్లు కేటాయింపు ఆ ప్రాజెక్టుకు పెద్ద మలుపు కానుంది.     
– అరుణ్‌కుమార్‌జైన్, జీఎం దక్షిణ మధ్య రైల్వే  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)