Breaking News

నాడు కొడుకు.. నేడు తండ్రి..!

Published on Sat, 02/14/2026 - 09:42

నెల్లిమర్ల రూరల్‌: ఒక ఇంటిపై విధి ఎంత క్రూరంగా విరుచుకుపడిందన్నది సారిపల్లి గ్రామం కన్నీళ్లతో చెబుతోంది. ఎనిమిది నెలల కిందట కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆ తండ్రి... ఇంకా ఆ బాధ నుంచి కోలుకోకముందే అదే తరహా ప్రమాదంలో ప్రా ణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. కాశీయాత్ర నుంచి తిరిగి వస్తూ నాడు కొడుకు, నేడు తండ్రి... అనే మాట గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన నడిపేన శ్రీనివాసరావు(58) వృత్తి రీత్యా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగి స్తున్నాడు. మండలంలోని కొండవెలగాడ, చంద్రంపేట, సారిపల్లి గ్రామాలకు చెందిన సుమారు 40 మంది భక్తులతో ఈ నెల 8న కాశీయాత్రకు వెళ్లిన బస్సుకు ఆయనే డ్రైవర్‌. తిరుగు ప్రయాణంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లా బాహానాగ్‌ జాతీయ రహదారిపై బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. 

ఆ దాటికి బస్సు ముందు భాగంలోని అద్దాలు పగిలి సుమారు 20 అడుగులు ఎత్తు నుంచి బ్రిడ్జి కిందకు పడిపోయాడు. దీంతో తల, కంటి భాగంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు కాగా, కొండవెలగాడ గ్రామానికి చెందిన ఎ.సూర్యనారాయణ అనే వ్యక్తి కాలు విరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ శ్రీనివాసరావు మృతిపై కుండాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

పగబట్టిన ప్రమాదాలు..  
మృతుడు శ్రీనివాసరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరీష్‌ భోగాపురం పోలీస్‌ స్టేషన్‌ లో హోంగార్డుగా డ్రైవర్‌ వృత్తి చేస్తున్నాడు. చిన్న కుమారుడు పురుషోత్తం కూడా తండ్రివలే డ్రైవర్‌ వృత్తి చేస్తూ భక్తులను సుదూర ప్రాంతాల్లో తీర్ధ యాత్రలకు తీసుకువెళ్లేవాడు. సుమారు ఎనిమిది నెలల కిందట భక్తులను కాశీ యాత్రకు తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోకముందే తండ్రి కూడా ఇదే విధంగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. మరో రెండు రోజుల్లో యాత్ర ముగించుకుని వస్తాడనే లోపే పెనువిషాదం జరగడంతో స్వగ్రామమైన సారిపల్లిలో విషాదం అలుముకుంది. ఓ వైపు గుండె సంబంధిత సమస్య, మరోవైపు కొద్ది నెలల వ్యవధిలోనే కుమారుడు, భర్త మృతితో నడిపేన కాసులమ్మ కన్నీరు మున్నీరుగా విలపించడం.. అక్కడి వారిని కంటతడి తెప్పించింది.  

    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)