Breaking News

దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి: కేటీఆర్

Published on Sat, 12/20/2025 - 20:44

సాక్షి హైదరాబాద్: రేవంత్ సర్కార్ హానీమూన్ ముగిసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన వాళ్లు ఆదారాలతో సహాదొరికారని అయినప్పటికీ వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. రేవంత్‌కు దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. 

సీఎం రేవంత్ ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో తనకు తెలియదు గానీ తాను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుతానని కేటీఆర్ అన్నారు. ఆయన ఇంట్లోని మహిళలు, పిల్లలు, మనమడి గురించి మాట్లాడి తన మాదిరి చిల్లర రాజకీయాలు చేయనని తెలిపారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్‌లోనే ఉన్నామంటున్నారని అది పెద్ద కామెడీలా అనిపిస్తుందన్నారు.  

కొంతమంది తనను ఐరన్‌ లెగ్ అంటున్నారని తాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాకే  32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీ స్థానాలు గెలిచామన్నారు. రేవంత్ సీఎం అయ్యాక కనీసం  సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేక పోయాడని కేటీఆర్ విమర్శించారు. కనుక తాను ఐరన్‌ లెగ్‌ కాదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఐరన్‌ లెగ్ అని కేటీఆర్ విమర్శించారు. 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ప్రజల్లోకి రానున్నారని ఆయన బహిరంగ సభలలో పాల్గొనే అంశం రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)