Breaking News

రకుల్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌కు డ్రగ్స్‌ పాజిటివ్‌: పోలీసులు

Published on Mon, 07/15/2024 - 17:40

సాక్షి, హైదరాబాద్‌: వీఐపీలే టార్గెట్‌గా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా నడుస్తున్నట్లు రాజేంద్ర నగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడినట్లు పేర్కొన్నారు. సోమవారం హైదర్షాకోట్‌లో దాడులు చేశామని, ఇద్దరు నైజీరియన్లు సహా డ్రగ్స్‌ అమ్ముతున్న అయిదుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 పాస్‌పోర్టులు, 10 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

డ్రగ్స్‌ను నైజీరియన్‌ మహిళ అనోహ బ్లెస్సింగ్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్‌ పాస్‌పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. 2019 నుంచి ఆమె డ్రగ్స్‌ సరాఫరా చేస్తోందని తెలిపారు. ముంబై, గోవా, బెంగళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్‌ను హైదరాబాద్‌కు నైజీరియన్‌ మహిళా తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్‌ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌  సింగ్‌  సోదరుడు అరెస్ట్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. అమన్‌ ప్రీత్‌ సింగ్‌తోపాటు డ్రగ్స్‌ తీసుకున్న  కిషన్‌ రాటి,  అంకిత్‌, యశ్వంత్‌, రోహిత్‌, శ్రీ చరణ్‌, ప్రసాద్‌ ,హేమంత్‌, నిఖిల్‌ దావన్‌, మధు, రఘు కృష్ణంరాజు వెంకట్‌.. మరో అరుగురుని అరెస్ట్‌  చేసినట్లు తెలిపారు. అంకిత్, అమన్ ప్రీత్ సింగ్, ప్రసాద్, నిఖిల్ ధావన్ సహా మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

ఇక డ్రగ్స్‌ సరాఫరా చేసిన అనోహా బ్లెస్సింగ్‌, నిజాం కాలేజీ విద్యార్థి అబీజ్‌ నోహం, బెంగళూరు లీడ్‌ కన్సల్టెన్సీ సీఈవో అల్లం సత్య వెంకట గౌతమ్‌, టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ మహ్మద్‌ మహబూబ్‌ షరీఫ్‌, సానబోయిన వరుణ్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సత్య వెంకట గౌతమ్‌పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు.

డ్రగ్స్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక సూత్రధాని ఏబుక సుజి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఏబుక సుజిపై రూ. 2 లక్షల రివార్డు ఉందని తెలిపారు. డ్రగ్స్‌ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్‌ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను పరీక్షిస్తే.. డ్రగ్స్‌ పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. అమన్‌ ప్రీత్‌ సింగ్‌ను  డ్రగ్స్‌ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని.. పెడ్లర్‌గా ఇంకా ఎస్టాబ్లిష్‌ కాలేదని అన్నారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం డ్రగ్స్‌ వినియోగదారుడైనా నిందితుడేనని తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)