Breaking News

రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులు ఎందరు..?

Published on Sat, 02/22/2025 - 10:51

భూపాలపల్లి : దారుణ హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి కేసు రోజుకో మలుపుతిరుగుతోంది.  హత్యకు పాల్పడింది ప్రత్యక్షంగా నలుగురే అయినప్పటికి ఆర్థికంగా, పరోక్షంగా పలువురు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చెందిన రాజలింగమూర్తి బుధవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానిక భూ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు తొలుత ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

అందులో ఏ–1 రేణుకుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి శ్రీమాంత్‌(బబ్లూ)లను హత్య జరిగిన రోజే అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కుమార్‌ పట్టుకున్నారు. ఏ–5 రేణుకుంట్ల కొమురయ్యతోపాటు నిందితులకు కారు ఏర్పాటు చేసి, డ్రైవింగ్‌ చేసిన పట్టణంలోని సుభాష్‌కాలనీకి చెందిన ఓ డ్రైవర్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు సమాచారం. అంతేకాక నిందితుల ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ ఆధారంగా, అనుమానితులైన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

హరిబాబు హస్తం ఉందా..? 
రాజలింగమూర్తి హత్య కేసులో భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్, బీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్త హరిబాబు హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజలింగమూర్తిని హత్య చేసిన అనంతరం నిందితులు.. ఓ వ్యక్తిని ఫోన్‌ అడిగి తీసుకొని హరిబాబుకు కాల్‌ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ మేరకు హరిబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి రెడ్డికాలనీలోని ఆయన ఇంటికి వెళ్లగా అందుబాటులో లేనట్లుగా తెలిసింది. 

మరో వ్యక్తి ఆర్థిక సహకారం.. 
రాజలింగమూర్తి హత్యకు మరో వ్యక్తి ఆర్థికంగా సహకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి తనదేనంటూ కోర్టుకు వెళ్లిన ఒకరు ఆర్థికంగా నిందితులకు సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇతను కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 

రేపు లేదా ఎల్లుండి అరెస్ట్‌..
రాజలింగమూర్తి హత్య కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నిందితులు ఎంతమంది ఉన్నారన్నది గుర్తించాక, ఆధారాలతో రేపు(ఆదివారం), లేదా సోమవారం అరెస్ట్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)