Breaking News

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

Published on Wed, 04/14/2021 - 07:35

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం పడుతుంది. బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్ నగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, బోరబండ, కుత్బుల్లాపూర్‌, ఎల్‌బీనగర్‌లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

రాష్ట్రంలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఇక ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 35 కేంద్రాల్లో వర్షపాతం రికార్డయిందని, భద్రాచలంలో అత్యధికంగా 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.
చదవండి:
తెలంగాణలో మళ్లీ ఎన్నికలు: రేపు నోటిఫికేషన్‌? 
కుంభకోణం: మాజీ మంత్రి పేషీ నుంచే..!

#

Tags : 1

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)