Breaking News

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Published on Thu, 09/11/2025 - 16:45

హైదరాబాద్‌:  నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్‌ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, షేక్‌ పేట్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, శామీర్‌పేట్‌, అంబర్‌పేట్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, మేడ్చల్‌ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్‌ నగర్‌-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  హయత్‌నగర్‌ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

ఇక మెదక్‌ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. 

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్‌ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్‌ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. 

మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్‌ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం

Videos

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)