మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
Published on Fri, 06/12/2026 - 21:33
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీఎం రేవంత్ విమానం వెనక్కి మళ్లింపు
హైదరాబాద్‌లో భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు.
Tags : 1