Breaking News

చొరబాటు ప్రయాణం!

Published on Sun, 02/09/2025 - 03:11

సాక్షి, హైదరాబాద్‌: మయన్మార్‌ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్‌లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. 

వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్‌ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్‌ నుంచి భారత్‌ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది.  

అక్కడి అలజడులతో ఇక్కడ దడ... 
బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 
 
మాంగ్డో నుంచి టెక్నాఫ్‌ నగరానికి..  
మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్‌ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్‌ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్‌ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్‌ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. 

అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు.  భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు.   
ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులుగా... 
కాక్స్‌ టౌన్‌లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచ్చిలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్‌ ఆలం, రియాసుల్‌ ఇస్లాం, బేగం దిల్‌బార్, రబీల్‌ ఇస్లాం పశ్చిమ బెంగాల్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  

పశ్చిమ బెంగాల్‌ నుంచి అనేక వైపులకు..
ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హట్‌ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశ్మీర్‌లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 

ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశ్చిమ బెంగాల్‌ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్‌ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్‌ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)