Breaking News

కొల్లాపూర్‌లో ప్రియాంక సభ వాయిదా.. కారణం చెప్పిన రేవంత్‌

Published on Wed, 07/19/2023 - 09:49

సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఈ నెల 20న జరగాల్సిన కాంగ్రెస్‌సభ వాయిదా పడింది. మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో నిర్వహించాలనుకున్న ఈ సభను వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అయితే, సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని తొలుత చెప్పినప్పటికీ, ఆమె వచ్చే అవకాశం లేనందున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వస్తారనే చర్చ జరిగింది.

కానీ, ఖమ్మం సభకు అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చిన నేపథ్యంలో కొల్లాపూర్‌ సభకు ప్రియాంకాగాంధీ రావడమే సరైందని భావించిన టీపీసీసీ నేతలు ఆ మేరకు కొల్లాపూర్‌సభను వాయిదా వేయాలని నిర్ణయించారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ప్రియాంక సమయం కోరగా, 23, 25, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సభ ఏర్పాటు చేసుకోవచ్చని, తేదీ ఖరారయిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టు తెలిసింది.

టీపీసీసీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ ఆస్తుల పరిరక్షణ కోసం మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా, సౌదారాం గంగారం కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ఆమోదం తెలపడంతో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ కమిటీలో పార్టీ నేతలు జి. నిరంజన్, కె.దయాసాగర్‌రావు, పొన్నం అశోక్‌గౌడ్, ఎం. రాంచంద్రారెడ్డి, టి.బెల్లయ్య నాయక్, ఎం.ఎ. ఫహీమ్‌లను సభ్యులుగా  ఉన్నారు.   

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)