Breaking News

‘ఒంటె సిద్ధాంతా’నికి విరుగుడు..‘గుర్రం’ స్టెప్పు! 

Published on Mon, 10/16/2023 - 01:06

కాస్త ఊపిరాడేలా, కొద్దిగా గాలీ–వెలుతురూ వచ్చేలా..కూసంత ‘‘సౌకర్యంగా’’ ఉండే ఓ గుడారాన్ని అడుగుతాడు ఓటరు. ఈ ‘సౌకర్యం’ అనే మాట ఏలినవారికి ‘విశాలం’ అనేలా ధ్వనిస్తుంది. ‘కోర్కెలు అనంతాలూ..వనరులు పరిమితాలు’ అనే ఎకనమిక్స్‌ సిద్ధాంతం ఇటు ఓటరుకూ, అటు పాలించేవారికీ అడ్డుపడుతుంది.గుడారం సైజు పెంచలేం. కాబట్టి దాంట్లోకి ఒంటెను వదలమంటారు ప్రభువులవారు. ఒక్కసారిగా కాదు. మెల్లమెల్లగా. మొదట తల, మెడ, తర్వాత సగం వరకు..అటు పిమ్మట మొత్తం ఒంటె దేహాన్ని. ఆ పైన ఒంటెను కొద్దిగా బయటకు తెచ్చినా..ఆ చర్య ఇచ్చే కాస్తంత వెసులుబాటూ ఎంతో గొప్పగా, మరెంతో ‘విశాలం’గా, ఇంకెంతో ‘సౌకర్యంగా’ అనిపిస్తుంటుంది. ఇదీ ఒంటె సిద్ధాంతం.  

ఈ సిద్ధాంతం అన్నది ఆల్వేస్‌ బ్రహ్మాండంగా వర్కవుట్‌ అవుతుందని కనిపెట్టినవారు రాజకీయవేత్తలే. అందుకే ‘సైంటిస్టు’ల సంక్లిష్ట సూత్రాల కన్నా..మన పొలిటికల్‌ లీడర్ల ప్రాక్టికల్‌ సిద్ధాంతాలే మిన్న.  ఈ సిద్ధాంతం అమల్లో కేంద్రంలోని పాలకులు ఇంకా గ్రేట్‌. వారు ఒకటీ, అరా కాకుండా ఏకంగా రెండుమూడు ఒంటెల్ని గుడారంలోకి ఒకేసారి ప్రవేశపెడతారు. వాటితో చాలాసేపు సహజీవనం చేయిస్తారు. ఆ తర్వాత ఒక్క ఒంటెను కాస్తంత బయటకు తెచ్చినా చాలు..అదే పదివేలు అనేలా సర్దుకుపోతాడు ఓటరు.  

కేంద్రంలోని పాలకులు ఈ ఒంటె సిద్ధాంతాన్ని అనేక విషయాల్లో అమలు చేస్తున్నారూ..చేస్తుంటారు. అన్నీ చెప్పుకోవడం కుదరదు కదా. మచ్చుకు గ్యాస్‌ సిలిండరును ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు రూ.400 దగ్గరున్న సిలెండరు చకచకా రూ.1200 వరకు వెళ్తుంది. కానీ ఎన్నికలప్పుడు కేవలం రూ.200 మాత్రమే తగ్గుతానంటుంది.  
ఘనత వహించిన బీఆర్‌ఎస్‌వారు ఒంటె సిద్ధాంతానికి బ్రహ్మాండమైన ఓ విరుగుడు కనిపెట్టారు.

వారి వాగ్దానం ప్రకారం... సిలిండర్‌ ధరను ఒకేసారి పదేళ్ల కిందటి ధరకు నెడతామంటున్నారు. దాంతో జేబుగలిగిన ప్రతి మారాజుకూ, కిచెన్‌ గలిగిన ప్రతి మహారాణికీ ఒక్కసారిగా ఎంతో భారం తొలగుతుందీ. మరెంతో భాగ్యం కలుగుతుంది.  టైమ్‌–మెషీన్‌లో ఒకేసారి పదేళ్ల వెనక్కు వెళ్లడమంటే మాటలా! ప్రజలందరికీ మూకుమ్మడిగా పదేళ్ల కిందినాటి వయసూ, యౌవనమూ, పదేళ్ల కిందటి విగరూ, పొగరూ పునర్‌–ప్రాప్తించిన ఫీలింగ్‌ కలగదా? 

విగరూ, పొగరూ పాలి­తు­లకూ!... ‘పవరు’పాలకులకు!! చదరంగంలో ‘గుర్రం’ స్టెప్పు ఒకటుంటుంది. దాన్ని ప్రయోగిస్తే..ఏకకాలంలో అది  రెండు ‘ఫోర్సు’లకు ఎసరు పెడుతుంది. ఇక్కడ సిద్ధాంతపు ‘ఒంటె’ సిద్ధాంతాన్ని దెబ్బకొట్టడానికి ‘గుర్రం’ స్టెప్పు వేశారు..వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్‌వారు.  

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు.  
ఒక పిట్ట..కేంద్రంలో గ్యాస్‌ సిలిండరు ధరను మూడు రెట్లు పెంచేసిన పార్టీ! మరో పిట్ట..పొరుగు రాష్ట్రంలోలా ఇక్కడా మహిళా సోదరీమణుల్ని బస్సుల్లో ఉచితంగా తిప్పాలనుకుంటున్న పార్టీ. ఎప్పుడో ఓసారి చేసే ‘ప్రయాణం’ కంటే  రోజూ కిచెన్‌లో చేసే ‘వంట’కే  కదా ప్రయారిటీ!!  ఇక... మూడో పిట్ట గురించి వేరే చెప్పాలా..ఇతర పిట్టలు తప్పించుకున్నా..ఇప్పటికిప్పుడు వేటకూ, వేటుకూ గురితప్పకుండా గురయ్యే ‘ఓటరు’ పిట్ట!!!

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)