Breaking News

కేసీఆర్‌కు పవర్‌ కమిషన్‌ నోటీసులు

Published on Tue, 06/11/2024 - 13:52

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మంగళవారం పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలలో తన పాత్రను తెలియజేయాలని ఆయన్ని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. 

పవర్‌ కమిషన్‌ నోటీసుల ప్రకారం.. జూన్‌ 15వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే.. జూలై 30 వరకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి నేరుగా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇచ్చే సమాధానం సంతృప్తిగా లేకపోతే ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని పవర్‌ కమిషన్‌ సంకేతాలిస్తోంది.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడీషియల్‌ కమిషన్‌ నియమించింది తెలంగాణ సర్కార్‌. ఈ క్రమంలో కమిషన్‌ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్‌ఎస్‌ హయాంలో పని చేసిన కొందరు అధికారుల్ని విచారణకు పిలిచి.. వివిధ కీలకాంశాలపై ప్రశ్నించింది ఈ కమిషన్‌. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్‌రావును ప్రశ్నించిన జస్టిస్‌ నరసింహారెడ్డి.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపించడం గమనార్హం.

కేసీఆర్ కు నోటీసులు

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి