Breaking News

బీజేపీ Vs కాంగ్రెస్‌.. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత

Published on Sun, 01/11/2026 - 21:21

సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో రెండు గంటలుగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయలైనట్టు తెలుస్తోంది.

వివరాల మేరకు.. యాదగిరిగుట్టలో ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి.  దీంతో, బలవంతంగా వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)