Breaking News

దారి తప్పుతున్న యువ ఖాకీలు

Published on Sun, 12/21/2025 - 13:45

ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్‌ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్‌ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్వయంగా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్‌ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ  ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో.. 

నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్‌  పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది.  

చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బెట్టింగ్‌ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్‌ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్‌ శాఖలో బలంగా వినిపిస్తోంది.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?