డయల్ 100.. స్పాట్‌లోనే దొరికిన దొంగ

Published on Mon, 01/05/2026 - 15:58

సాక్షి హైదరాబాద్: మియాపూర్ పోలీసులు శబాష్ అనిపించుకున్నారు. డయల్ 100కు కాల్ చేసిన క్షణాల్లోనే స్పందించి ఏటీఎంలో దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని సత్తా చాటుకున్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ బాధ్యతని దానికోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటామని పోలీసులు  తెలిపారు.  

పోలీసులు వివరాల ప్రకారం.. మాదాపూర్ జోన్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్, మార్థండనగర్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద నిన్న(ఆదివారం) రాత్రి సమయంలో దొంగతనం జరుగుతోందని గుర్తుతెలియని వ్యక్తులు 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. ఏటీఏంలో డబ్బుల చోరీకి యత్నిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్‌పేట్ గ్రామం వాసి కాటమయ్య (24)గా గుర్తించినట్లు తెలిపారు

ఏటీఏం చోరికి యత్నించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండి  చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్దనష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చుట్టు ప్రక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు నమోదైతే ప్రజలు డయల్–100కు కాల్ చేయాలని ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు.

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)