Breaking News

పీజేఆర్‌ ఫ్లైఓవర్‌పై.. రయ్‌ రయ్‌

Published on Sat, 06/28/2025 - 08:38

గచ్చిబౌలి: ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే మాదాపూర్‌ ప్రాంతం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుతో పాటు ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్‌ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 



ఫ్లైఓవర్‌ విశిష్టతలు.. 
ూ    ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్‌ వెళ్లేందుకు ట్రాఫిక్‌ కష్టాలు ఉండవు.  
ూ    శిల్పా లేఔట్‌ ఫేజ్‌–2 ఫ్లైఓవర్‌ కాగా.. దీనికి పీజేఆర్‌ ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు  
ూ    ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా 
ూ    ఇందులో ఫేజ్‌–2 ఫ్లైఓవర్‌ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు 
ూ    ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ రోడ్డు వరకు 630 మీటర్లు  
ూ    ఆబ్లిగేటరీ స్పామ్‌ (స్టీల్‌) 450 మీటర్లు  
ూ    త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు  
ూ    క్యారెట్‌ వే 6 లైన్ల  బై డైవర్షనల్‌ 
ూ    కొండాపూర్‌ వైపు డౌన్‌ ర్యాంప్‌ రెండు వైపులా 165 మీటర్లు 
ూ    వెడల్పు 12 మీటర్లు  
ూ    ఆరు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మాణం  

ఉపయోగాలు ఇలా.. 
 మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్‌  వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌కు ఉపశమనం 
 ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు 
ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య మెరుగైన కనెక్టివిటీ  
గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద పీక్‌ అవర్‌లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా  
ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా  

ఫ్లైఓవర్‌ పరిశీలన..   
శుక్రవారం పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాం«దీ, అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట వెస్ట్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌ హేమంత్‌ సహదేవ్‌రావు, ప్రాజెక్ట్‌ సీఈ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ, ఇతర అధికారులు ఉన్నారు.  

సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు 
పీజేఆర్‌ సతీమణి ఇందిర  శిల్పా లేఅవుట్‌ రెండో దశ ఫ్లై ఓవర్‌కు దివంగత నేత పి.జనార్దన్‌ రెడ్డి పేరు పెడుతున్నట్లు జీఓ విడుదల చేయడంతో ఆయన సతీమణి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచి్చందన్నారు. ఫ్లై ఓవర్‌ ప్రారం¿ోత్సవానికి వచ్చి సీఎం, మంత్రులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోతున్నానని ఆమె తెలిపారు.  

మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం హర్షణీయం 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 
సాక్షి, సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద మరో ప్రాజెక్ట్‌ అందుబాటులోకి రానుండటం సంతోషంగా, గర్వంగానూ ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. శనివారం పీజేఆర్‌ (శిల్పా లే ఔట్‌ ఫేజ్‌–2) ఫ్లై ఓవర్‌ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్‌ వేదికగా ఫ్లై ఓవర్‌ వీడియోను శుక్రవారం ఆయన షేర్‌ చేశారు. ఎస్సార్‌డీపీలోని 42 ప్రాజెక్టుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని గుర్తు చేశారు.   

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)